ETV Bharat / crime

Fake Doctor: నాలుగేళ్లలో 43 వేల మందికి ‘వైద్యం’ - fake doctor in warangal

fake doctor in warangal: సమాజంలో దొంగ బాబాలు, నకిలీ డాక్టర్​ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఈ 'నకిలీ'లకు ఆదాయ మార్గంగా మారింది. ప్రాణాలపై ఆశతో వారి వద్దకు వెళ్తే.. జీవితంపై ఆశలు వదులుకునేలా చేస్తున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో దండిగా దండుకుని.. జేబులు గుళ్ల చేస్తున్నారు. వరంగల్​లో ఇలాంటి ఓ నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు.

fake doctor in warangal:
Fake Doctor: నాలుగేళ్లలో 43 వేల మందికి ‘వైద్యం’
author img

By

Published : Aug 4, 2022, 9:23 AM IST

fake doctor in warangal: ఎలాంటి వైద్య విద్యార్హతలు లేకుండా చికిత్సలు చేస్తున్న నకిలీ వైద్యుడు, అతడి సహాయకుడిని వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నాలుగేళ్ల కాలంలో రోజుకు 30-40 మంది చొప్పున సుమారు 43 వేల మందికి నకిలీ వైద్యుడు ‘వైద్యం’ అందించాడని దర్యాప్తులో వెల్లడైందని పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి తెలిపారు. ఆయన బుధవారం వివరాలు వెల్లడించారు. వరంగల్‌ నగరానికి చెందిన ముజతాబా అహ్మద్‌ బీఫార్మసీ విద్యాభ్యాసాన్ని మధ్యలో ఆపేసి ఓ స్థానిక వైద్యుడి వద్ద సహాయకుడిగా పని చేస్తుండేవాడు. డబ్బులు సరిపోక నకిలీ వైద్యుడి అవతారమెత్తాడు.

....

ఎయిమ్స్‌ నుంచి ఎంబీబీఎస్‌ చేసినట్లు నకిలీ ధ్రువపత్రం సొంతంగా సృష్టించుకున్నాడు. నగరంలోని చింతల్‌ ప్రాంతంలో 2018లో హెల్త్‌కేర్‌ ఫార్మసీ పేరిట ఆసుపత్రి ప్రారంభించాడు. అతనికి సహాయకుడిగా దామెరకొండ సంతోశ్​ పని చేస్తున్నాడు. నిజమైన వైద్యుడినేనని ప్రజలను ముజతాబా నమ్మించి.. చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. అవసరం లేకున్నా రోగనిర్ధారణ పరీక్షలు రాసి, మందులు ఇచ్చేవాడు. వ్యాధి చిన్నదైనా భయపెట్టి పెద్ద ఆసుపత్రులకు పంపించి కమీషన్లు దండుకునేవాడు.

నకిలీ వైద్యుడిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. నకిలీ వైద్య ధ్రువపత్రాలతో పాటు రూ.1.90 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్‌ పరికరాలను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.