ETV Bharat / crime

స్వామీజీ అనుమానాస్పద మృతి... అసలేం జరిగింది?

Swamiji Suspect Death In ntr District : ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో భోదానంద స్వామి ఆశ్రమంలో స్వామీజీ రామకృష్ణానంద స్వామి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్వామిజీ మృతిపై ఆయన తల్లి అనుమానం వ్యక్తం చేశారు.

స్వామీజీ రామకృష్ణానంద స్వామి అనుమానాస్పద మృతి

author img

By

Published : Dec 12, 2022, 4:41 PM IST

Ramakrishna Nanda Swamiji Suspect Death in NTR District : ఏపీ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబర్​పేట గ్రామంలో సద్గురు భోదానంద స్వామి ఆశ్రమంలో స్వామీజీ రామకృష్ణానంద స్వామి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్వామీజీ తల్లి భ్రమరాంబ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ నంద స్వామీజీకి గత ఆదివారం అనారోగ్యంగా ఉండటంతో నందిగామలోని వైద్యశాలకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేశారు.

పూర్తి ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడు.. ఒకేసారి ఎలా మరణిస్తారని, దీనిపై విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు నందిగామ సీఐ సతీష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ మార్చురికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.