ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి.. అపస్మారక స్థితిలో తల్లి! - చిన్నారుల మృతి

suspicious death of kids
ఇద్దరు చిన్నారులు మృతి
author img

By

Published : Dec 18, 2021, 1:44 PM IST

Updated : Dec 18, 2021, 7:27 PM IST

13:36 December 18

చిన్నారుల తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

Suspicious Death of Kids: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం టేకులపల్లిలో దారుణం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలోని కోళ్ల ఫామ్ వద్ద... ఇద్దరు పసి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందారు. తాండూరు మండలం ఉద్దండపురానికి చెందిన... సుభాష్, మంజుల వారి ముగ్గురు కుమార్తెలతో కలిసి టేకులపల్లిలోని ఓ కోళ్ల ఫామ్​లో కూలీ పని చేసేందుకు వారం రోజుల కిందట వచ్చారు. అక్కడే షెడ్‌లో ఉంటూ పనులు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇవాళ ఉదయం చూసేసరికి... ఇద్దరు చిన్నారులు మైత్రి, మహేశ్వరి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రి సుభాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లి అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పిల్లల మరణానికి కారకులెవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : Cyber Crime: వ్యాపారి వ్యాలెట్ల హ్యాకింగ్.. సందేశం రాకుండా రూ.2.2 కోట్లు స్వాహా

Last Updated : Dec 18, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.