మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాలో ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సునీల్ అవివాహితుడు కావడంతో గిరిజన సాంప్రదాయం ప్రకారం సునీల్ మృతదేహానికి... జిల్లేడు చెట్టుకు వివాహం జరిపించారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తండా వాసుల అశ్రునయనాల మధ్య ట్రాక్టర్‌పై అంతిమ యాత్ర కొనసాగింది. సునీల్ చితికి తండ్రి రంధన్ నిప్పంటించాడు. అంతిమయాత్రకు స్థానిక భాజపా, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడం లేదంటూ గత నెల 26న హన్మకొండలో ఆత్మహత్యకు యత్నించిన సునీల్ నాయక్ (25) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
ఇదీ చూడండి : టిప్పర్ బీభత్సం..