ETV Bharat / crime

ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్​ నాయక్​ మృతి - వరంగల్​ వార్తలు

ku sunil naiak, boda sunil, కేయూ విద్యార్థి,సునీల్​ నాయక్​
sunil naiak dies, boda sunil, ku student
author img

By

Published : Apr 2, 2021, 7:01 AM IST

Updated : Apr 2, 2021, 12:44 PM IST

06:57 April 02

నిమ్స్‌లో చికిత్స పొందుతూ సునీల్ నాయక్ మృతి

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడం లేదంటూ గత నెల 26న హన్మకొండలో ఆత్మహత్యకు యత్నించిన సునీల్‌ నాయక్‌ (25) చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

 మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్‌సింగ్‌ తండాకు చెందిన బోడ సునీల్‌నాయక్‌ డిగ్రీ చదివాడు. ఐదేళ్లుగా పోలీస్‌ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. 2016లో పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దారుఢ్య పరీక్షల్లో రాణించలేదు. ప్రసుత్తం హన్మకొండ నయీంనగర్‌లో ఓ గది అద్దెకు తీసుకొని కేయూలోని గ్రంథాలయానికి రోజూ వచ్చి పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచడంతో నిరాశ చెందాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయదని మనస్తాపానికి గురయ్యాడు.  కేయూ క్రీడామైదానంలో పురుగుల మందు తాగాడు.

  ‘నేను చేతకాక చావడం లేదు.. నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి’ అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కేయూ పోలీసులు వెంటనే అతణ్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.

ఇదీ చూడండి: ఉపాధి, ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: కోదండరాం

Last Updated : Apr 2, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.