వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో స్నేహా నగర్‌కు చెందిన ఓ యువతి అజ్జు అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమనే సరికి యువకుడు నిరాకరించడంతో... మోసపోయానని గ్రహించి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది. ఈ కేసులో అజ్జు జైలుకు వెళ్లి వచ్చాడు.
మంగళవారం మధ్యాహ్నం నర్సంపేటలోని ఎన్టీఆర్నగర్లో ఉంటున్న అజ్జు ఇంటికి వెళ్లి... పెళ్లి చేసుకోవాలని కోరింది. యువకుడు ససేమిరా అనడంతో ఇంటి ఆవరణలో ఉన్న బావిలోకి దూకేసింది. అజ్జు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్సై నవీన్ ఆధ్వర్యంలో సిబ్బంది బావిలోకి దిగి యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: నిబంధనలు తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్