ETV Bharat / crime

CORRUPTION: ప్రతి పనికీ రేటు.. లేఖర్లు, ప్రైవేటు వ్యక్తులతో వసూళ్లు - పని కోసం లంచం

హైదరాబాద్‌ నగర శివార్లలోని ఓ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ లంచాల వసూళ్ల కోసం ఏకంగా ఓ ప్రైవేటు వ్యక్తినే నియమించుకున్నట్లు సమాచారం. ఆరోజు జరిగిన లావాదేవీల వివరాలు తీసుకుని సాయంత్రానికి వసూలు చేసి అధికారి చేతికి మట్టజెప్పడం ఆ వ్యక్తి పని. ఇవే కాదు మూడు జిల్లాల పరిధిలో ఉన్న ఎక్కువ శాతం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఏ పని జరగాలన్నా ఎంతో కొంత చెల్లించుకోవాల్సిందే. తరచూ ఫిర్యాదులు వస్తున్నా, అనిశా దాడులు చేస్తున్నా ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.

CORRUPTION
లంచాల వసూళ్లు
author img

By

Published : Oct 8, 2021, 9:00 AM IST

కుషాయిగూడకు చెందిన ఓ క్యాన్సర్‌ బాధితురాలు ఇటీవల తన ఆస్తినంతా తితిదే ట్రస్టుకు వీలునామా రాశారు. అధికారికంగా రూ.650 అయ్యే చలానాతో కాప్రా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నేరుగా వెళ్తే పనికాకపోవడంతో ఓ లేఖరికి రూ.3,500 ఇచ్చి చేయించుకోవడం గమనార్హం. ఇక్కడే రూ.100 కడితే ఇవ్వాల్సిన ఎన్‌వోసీలకు రూ.1000 కట్టించుకొని జారీ చేస్తున్నారు. యాచారంలో ఓ వ్యక్తి 300 చ.అడుగుల ప్లాటు రిజిస్ట్రేషన్‌కు అధికారికంగా రూ.1.20లక్షలు రుసుము, రూ.8,800 స్టాంపు డ్యూటీ, ఇతర ఛార్జీలతో పాటు ఇబ్రహీంపట్నంలో ఓ లేఖరికి రూ.10వేలు ఇస్తేనే పని జరిగింది. అన్ని కేంద్రాల్లోనూ దాదాపు ఇదే తంతు.

దస్తావేజు లేఖరులదే దందా..

దళారులు, దస్తావేజు లేఖర్ల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా.. ఆ దారిలో వెళ్తే పత్రం ముందుకు కదలదు. అదే లేఖరిని సంప్రదించి చేయి తడిపితే స్టాంపు డ్యూటీ సరిగా లేకున్నా, ఏ పత్రాలు లేకున్నా, అది అక్రమ రిజిస్ట్రేషన్‌ అయినా ముందూవెనకా చూడకుండా సంతకం పెట్టేస్తున్న పరిస్థితి దాదాపుగా అంతటా నెలకొంది. దీంతో దస్తావేజులు రాయడం మొదలుకొని, అనుబంధ పత్రాల సమర్పణ, ఛార్జీల లెక్కింపు, చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ ఇలా అన్నింటికీ లేఖరులదే పని. అధికారిదే పెద్ద వాటా అని చెప్పి వచ్చిన వారి నుంచి పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు.

‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దాదాపు 2వేల మంది దస్తావేజు లేఖరులుండగా.. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న 42 కార్యాలయాల్లో 700 నుంచి 800దాకా లేఖరులున్నారు. వీరిలో సగానికిపైగా నకిలీ స్టాంపులతో అక్రమంగా చలామణీ అవుతున్నవారే కావడం గమనార్హం.''

లేఖరి మధ్యవర్తిత్వం

దుకాణాల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన బోరబండకు చెందిన షరీఫ్‌ నుంచి లంచం డిమాండ్‌ చేశాడు బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ నిజాముద్దీన్‌. దీనికి దస్తావేజు లేఖరి జియాఉద్దీన్‌ మధ్యవర్తిత్వం నడిపాడు. అన్నీ సరిగా ఉన్నప్పుడు లంచమెందుకివ్వాలంటూ బాధితుడు అనిశా అధికారులను సంప్రదించాడు. వలపన్నిన అధికారులు రూ.75వేల లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ను పట్టుకున్నారు. గత నెలలో జరిగిందీ ఘటన. మూడేళ్లగా ఈ కార్యాలయంలో అవినీతిపై అనేక ఫిర్యాదులు. ఇక్కడ ముందుగా లంచం చెల్లిస్తేనే ఏ పత్రమైనా లేఖరి బల్ల దాటి అధికారి వరకూ చేరుతుంది.

శంషాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపైనా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి నుంచి ఆస్తి కుటుంబసభ్యుల పేరున మార్చేందుకు లంచం డిమాండ్‌ చేశారని ఒకరు, భూమి దస్తావేజు రిజిస్ట్రేషన్‌ కోసం రూ.50వేలు అడిగారని మరొకరు.. ఇలా చాలామంది నుంచి ఫిర్యాదులందుతున్నాయి. ఈ కార్యాలయంలో ఉన్న దాదాపు 15మంది లేఖర్లు ఏది చెబితే అదే నడుస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. అన్ని పత్రాలు సరిగా ఉన్నా రూ.3వేల దాకా వసూలు చేస్తుండగా.. ఏ చిన్న సమస్య ఉందని తెలిసినా రూ.40వేల నుంచి రూ.లక్ష దాకా భూముల విలువను బట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల కొందరు స్థానికులు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేకూ ఇదే విషయమై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇటీవల ఇక్కడి అవినీతిపై అనిశాకు సైతం ముగ్గురు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: Acb Raids: అనిశా వలలో అవినీతి ఎస్సై... ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులోనే...

దొంగతనమే కాదు.. లంచం తీసుకోవడమూ ఓ కళే!

Telugu academy scam: నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.