ETV Bharat / crime

auto crashes into canal: కాలువలోకి దూసుకెళ్లిన విద్యార్థుల ఆటో..

auto crashes into canal: కరీంనగర్​లో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించడంతో చిన్నారులు ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

author img

By

Published : Feb 2, 2022, 1:29 PM IST

Updated : Feb 2, 2022, 5:24 PM IST

school auto accident
కాలువలోకి దూసుకెళ్లిన ఆటో..
కాలువలోకి దూసుకెళ్లిన విద్యార్థుల ఆటో..

auto crashes into canal: కరీంనగర్ జిల్లా కేంద్రం రేకుర్తి శివారు ప్రాంతంలో ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆటోలో నలుగురు స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వెంటనే గమనించిన స్థానికులు జేసీబీ సాయంతో ఆటోను బయటకు తీసి విద్యార్థులను కాపాడారు. ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నగరంలోని షేకాభి కాలనీకి చెందిన పాఠశాల విద్యార్థులు స్కూలుకు వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోడ్రైవర్ మైనర్ కాగా ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వెంటనే మేడారం జాతర ఏర్పాట్లలో పని చేస్తున్న జేసీబీ సాయంతో ఆటోను, పిల్లలను సురక్షితంగా బయటికి తీశారు. ఆదివారం కరీంనగర్ ప్రమాద ఘటన ఇంకా మరువకముందే జరిగిన ఈ ఘటనతో కలకలం రేపింది.

school auto accident
కాలువలోకి దూసుకెళ్లిన ఆటో..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Last Updated : Feb 2, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.