A boy died in Bus Accident: ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఉక్కునగరం సెక్టర్-8 వద్ద తల్లితో కలిసి రోడ్డు దాటుతున్న ఏడేళ్ల బాలుడిని బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో ఫార్మాసిటీకి చెందిన బస్సు బాలుడిని ఢీకొట్టింది. ఉక్కునగరంలోకి ఫార్మా బస్సుల ప్రవేశంపై.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
స్టీల్ ప్లాంట్ డ్యూటీ, పాఠశాలల సమయాల్లో ఫార్మా బస్సులు ఉక్కునగరంలోకి అతి వేగంగా ప్రవేశిస్తున్నాయంటూ.. ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: