కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శునకాల దాడిలో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసి... తీవ్రంగా గాయపరిచాయి.
పిల్లల అరుపులు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తోన్న పేలుడు పదార్థాలు స్వాధీనం