ETV Bharat / crime

శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం.. మేనేజర్ అరెస్టు - శ్రీశైలం కెనరా బ్యాంకు కుంభకోణం

శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు మేనేజర్​తో పాటు గోల్డ్ అప్రైజర్​ను అరెస్టు చేసినట్లు శ్రీశైలం సీఐ బీవీ రమణ స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈ రుణాల మోసాలపై కూడా దర్యాప్తు సాగుతోందని సీఐ స్పష్టం చేశారు.

శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం.. మేనేజర్ అరెస్టు

author img

By

Published : Apr 23, 2022, 6:38 PM IST

ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు మేనేజర్​తో పాటు గోల్డ్ అప్రైజర్​ను అరెస్టు చేసినట్లు శ్రీశైలం సీఐ బీవీ రమణ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో మేనేజర్ శివనాగేశ్వరరావు, గోల్డ్ అప్రైజర్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు తేలిందని సీఐ వెల్లడించారు. ఆత్మకూరు కోర్టుకు నిందితులను తరలిస్తున్నామని తెలిపారు. నిందితులు నకిలీ బంగారం, పత్రాలు సృష్టించి రుణాలు కొల్లగొట్టినట్లు చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రుణాల మోసాలపై కూడా దర్యాప్తు సాగుతోందని సీఐ స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే: పూచీకత్తు లేకుండా రుణాలిప్పించారు. తీరా చూస్తే రుణంలో సగం సొమ్ము కాజేశారు. తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించమంటే ముఖం చాటేశారు. ఇదంతా చేసింది దళారులో, మరెవరో కాదు...స్వయానా బ్యాంకు సిబ్బందే. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని కెనరా బ్యాంకు అధికారుల తీరిది. రుణాలు ఇప్పిస్తామని చెప్పి శ్రీశైలంలోని కెనరా బ్యాంకు అధికారులు తమని మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఆటో నడుపుకునేందుకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి...పూచీకత్తు లేకుండానే రుణాలు ఇప్పించి..బురిడి కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రుణాలు, సబ్సిడీ రుణాలు కూడా ఇస్తున్నామని బుకాయించి.. అడిగిన మొత్తం కంటే ఎక్కువే ఇస్తామని మభ్య పెట్టారని వివరించారు. కెనరా బ్యాంకులో...ఆ బ్యాంకు సిబ్బంది తమకు రుణాలు మంజూరు చేశారని, ఆ రుణంలో సగం సొమ్ము బ్యాంకు సిబ్బంది కాజేసినట్లు బాధితులు వాపోతున్నారు. తీరా దానిని కట్టమంటే కట్టట్లేదని గోడు వెళ్లపోసుకున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేసి రుణాన్ని పూర్తిగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.