NRI Chigurupati jayaram case : ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త హత్యకేసులో నిందితుడు రాకేష్‌రెడ్డి తరపున సాక్షులను బెదిరించినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
NRI murder case: చిగురుపాటి జయరాం హత్యకేసులో సాక్షులుగా ఉన్న భార్యాభర్తలను బెదిరించినందుకు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉన్నారు ఎస్సై సైదులు పేర్కొన్నారు. 2019లో చిగురుపాటి జయరాం హత్యకు గురి కాగా.. ఈ కేసులో చింతల్ సమీపంలో మీనాక్షి కాలనీకి చెందిన కె.మల్లికార్జునరావు, ఆయన భార్య సాక్షులుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న మల్లికార్జునరావు అమీర్‌పేట్ సారథి స్టూడియో వద్ద ఉన్న తన కార్యాలయంలో ఉండగా సెప్టెంబర్ 30న శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డికి మద్దతు పలకాలని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చింతల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.