Cheater Arrest in SR Nagar : నకిలీ యూరో కరెన్సీ, బంగారం ప్లేట్‌తో అమాయకులను మోసం చేసిన రాజేశ్ అనే వ్యక్తిని హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న తాడపట్ల రాజేశ్.. తన వద్ద మిలియన్ యూరో కరెన్సీ, రెండు బంగారు ప్లేట్లు ఉన్నాయని నమ్మించి... పలువురిని మోసం చేయడానికి యత్నించాడు. కాగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.
![Cheater Arrest in SR Nagar, hyderabad cheater arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14038595_cheater-2.jpg)
పక్కా సమాచారంతో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు... రాజేశ్‌ను అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లు, బంగారం ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ కోసం స్థానిక ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Road Accidents in cyberabad 2021: ఆ సమాయాల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు... జాగ్రత్త!