ETV Bharat / crime

Cyber Crime: 20 మందికి సందేశాలు పంపితే కారు ఉచితం!! - cyber cheating

‘‘ముప్పై మిలియన్ల కార్లు అమ్ముడైన సందర్భంగా ఫలానా కంపెనీ మీకు ఉచితంగా కారు ఇస్తోంది. మీ వివరాలు పంపితే చాలు’ అంటూ మీ వాట్సాప్‌కు సందేశం వచ్చిందా?  ‘‘ ఫలానా సంస్థ వార్షికోత్సవ సందర్భంగా వినియోగదారులకు కార్లు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం.. తీసుకోండి.’’ అన్న ప్రకటనలు మీ చరవాణికి వస్తున్నాయా?..ఇవి నిజం కాదు. కారు వస్తుందంటూ మీ వాట్సాప్‌ను తెరచి అందులో వివరాలన్నీ నింపేసి.. మీ స్నేహితులు, సన్నిహితుల్లో 20 మందికి పంపినా సరే.. మీకు కారు రాదు. ఎందుకంటే ఇది సైబర్‌ నేరస్థుల తాజా మాయాజాలం.

Cyber Crime
Cyber Crime: 20 మందికి సందేశాలు పంపితే కారు ఉచితం!!
author img

By

Published : Jun 9, 2021, 10:53 AM IST

.

రెండు, మూడు రోజుల నుంచి మెట్రో నగరాల్లో లక్షల మందికి ఓ వాహన సంస్థ పేరుతో ప్రకటనలు వెళ్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ కంపెనీ పేరుతోనూ సైబర్‌ నేరస్థులు లింకులు పంపించారు. స్పందించిన వారి నుంచి రూ.లక్షల్లో నగదు బదిలీ చేసుకున్నారు. ‘మా సంతోషం... మీకు వాహన యోగం’ అంటూ సైబర్‌ నేరగాళ్లు ప్రకటనలు పంపుతున్నారు. కార్లు ఉచితంగా ఇస్తామంటే పార్కింగ్‌ లేకపోయినా ఎక్కడో ఒకచోట ఉంచొచ్చని అనుకునేవారు ఆకర్షితులవుతారన్న అంచనాతో కొన్ని కంపెనీల సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌లు వినియోగిస్తున్న వినియోగదారులకు వాట్సాప్‌ లింక్‌లను పంపుతున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు ఇలా 2 వేల నుంచి 5 వేల ప్రకటనలను పంపుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రకటనలో లింక్‌ను తెరవగానే.. వారు 20 మందికి పంపుతారని, ఇలా రోజుకు నలభై వేల నుంచి లక్ష మందికి లింక్‌లు వెళ్తాయని, వీరిలో వంద మంది స్పందించినా రూ.లక్షలు కొల్లగొట్టవచ్చన్నది సైబర్‌ నేరస్థుల వ్యూహంగా పోలీసులు భావిస్తున్నారు.

కారు పంపుతామంటూ..

వాట్సాప్‌ లింక్‌ పంపిన అనంతరం సైబర్‌ నేరస్థులు ఫోన్‌ చేస్తున్నారు. ఆధార్‌ నంబరు, ఇంటి చిరునామా చెబితే.. కారు పంపుతామని చెబుతున్నారు. అనంతరం కారు కావాలా?.. డబ్బు కావాలా? అని అడుగుతారు. వద్దంటే రూ.12 లక్షల నగదు ఇస్తామంటూ వివరిస్తున్నారు. నగదు తీసుకుంటామని చెప్పిన వెంటనే ఉచితంగా ఇచ్చినట్లు నమోదు చేసేందుకు రూ.5 వేలు ఇవ్వాలంటున్నారు. ఈరోజు, రేపు కారు పంపుతామంటూ దశలవారీగా రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు నగదు బదిలీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మోసాలకు సంబంధించి తమకు స్థానికంగా ఫిర్యాదులు రాలేదని, బెంగళూరు, చెన్నైలలో కేసులు నమోదయ్యాయని పోలీస్‌ అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.