Raids on Hyderabad Club : హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని మంజీరా మెజెస్టిక్‌లో "క్లబ్ మస్తీ బిస్ట్రో బార్ అండ్ పబ్"పై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పబ్‌లో యువతులను నియమించుకుని అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్నట్లు అందిన సమాచారంతో.. మాదాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్‌లో ఉన్న తొమ్మిది మంది యువతులతో పాటు పబ్ మేనేజర్ ప్రదీప్‌కుమార్, డీజే ఆపరేటర్ ధనరాజ్, కస్టమర్ సాయి, సంతోశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమాని శివప్రసాద్, మరో ఇద్దరు మేనేజర్లు శివ, విష్ణు పరారీలో ఉన్నారు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయించటం, పరిమితికి మించి డీజే సౌండ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పబ్‌లో జరిపిన దాడుల్లో డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చదవండి: ఉక్రెయిన్‌పై ఆగని యుద్ధం.. వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరం