మొబైల్ యాప్స్‌తో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠానా హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు (IPL betting gang arrested). బెట్టింగ్‌కు పాల్పడుతున్న 23 మంది బుకీలను పట్టుకుని... వారి నుంచి రూ. 93లక్షల నగదు, 2.2కోట్లు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు(sot police ride on betting gang). పక్కా సమాచారంతో మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్ పల్లి సహా 7 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
నిందితులపై గేమింగ్ యాక్ట్‌తో (gaming act)పాటు 7 కేసులు నమోదు చేశారు. బుకీలకు ముంబయి, గోవా, దుబాయ్‌లతో నెట్వర్క్ ఉన్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కరోనా వల్ల డిజిటలైజేషన్ పెరిగి... పిల్లలు ఫోన్‌లు ఎక్కువగా వాడుతున్నారని... యాప్‌ల ద్వారా సులభంగా బెట్టింగ్ చేస్తున్నారని వెల్లడించారు. విద్యార్థుల మొబైల్ యాప్‌లను తల్లిదండ్రులు పరిశీలించాలని సూచించారు.
క్రికెట్ బెట్టింగ్ ప్రక్రియ నాలుగు లేయర్లుగా ఉంటుంది. మొదటి వరుసలో ప్రధాన బుకీ ఉంటాడు. రెండో వరుసలో సబ్ బుకీ, మూడో వరుసలో బుకీలు ఇక నాలుగో వరుసలో బెట్టింగ్‌లో పాల్గొనేవారు ఉంటారు. మేజర్ బెట్టింగ్ రాకెట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. -స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ.
ఇదీ చూడండి: IPL Betting: : ఐపీఎల్లో 'వాట్సాప్' బెట్టింగ్.. ఎలా జరుగుతోంది? చివరికి ఏమవుతోంది?