ETV Bharat / crime

తల్లిని హతమార్చి.. నగలతో పరార్​

నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లినే గొంతు నులుమి హత్య చేశాడో కొడుకు. హత్య.. దొంగల పనేనని నమ్మించబోయి.. పోలీసులకు చిక్కిపోయాడు. హైదరాబాద్​ చింతల్​లో జరిగిందీ ఘటన.

son killed the mother
son killed the mother
author img

By

Published : May 12, 2021, 9:29 AM IST

నగల కోసం తల్లినే చంపాడో కిరాతకుడు. ఈ ఘటన హైదరాబాద్, చింతల్​​లో చోటుచేసుకుంది. భగత్ సింగ్ నగర్​కు చెందిన హరి(24).. రెండేళ్ల క్రితం తాను చేస్తోన్న ఉద్యోగం మానేశాడు. నిత్యం ఉద్యోగానికి వెళ్తున్నానని నమ్మించి.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంకాలానికి తిరిగొచ్చేవాడు. రోజూ లాగే బయటకు వెళ్లిన హరి.. కాసేపటికి తిరిగొచ్చి టవల్​తో తల్లి స్వరూప(48)ను హతమార్చాడు. ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు.

రాత్రి ఇంటికి వచ్చిన హరి తండ్రి మల్లేశ్​.. విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. కుమారుడికి సమచారమివ్వగా.. ఇంటికి వచ్చిన నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా జరిగిన హత్య… దొంగల పనేనని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు.. సీసీ టీవీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు హరిని అరెస్ట్​ చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: హిడ్మా ఆదేశాలతోనే పేలుడు పదార్థాల రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.