ETV Bharat / crime

mother murder: బ్లేడుతో గొంతు కోసి.. తల్లిని చంపేశాడు..!

author img

By

Published : Jun 19, 2022, 4:57 PM IST

mother murder: నవమాసాలు కడుపులో మోసిన తల్లిని.. పేగు తెంచుకు పుట్టిన కొడుకే కర్కశంగా చంపేశాడు! వేకువజామున ఎవరూ లేని సమయంలో తల్లి గొంతుకోసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఏపీ పల్నాడు జిల్లాలో జరిగింది.

తల్లిని చంపేశాడు
తల్లిని చంపేశాడు

mother murder: ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట సమీపంలో దారుణం జరిగింది. కన్నకొడుకే తల్లిని బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులు కథనం ప్రకారం.. రాజాపేటకు చెందిన దార్ల వీరయ్య 20 సంవత్సరాలుగా సత్తెనపల్లిలో నివాసం ఉంటున్నాడు. 4 సంవత్సరాల క్రితం రాజాపేట నుంచి తల్లి ఆదిశేషమ్మ(67)ను సత్తెనపల్లిలోని తన వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు.. ఆదివారం తెల్లవారుజామున నిందితుడు తల్లి గొంతుకోసాడు. ఆమెను రాజాపేట- పోతవరం మధ్య ఓగేరు వాగు వంతెనపై వదిలేసి వెళ్ళాడు‌.

గొంతు తెగిపోయిన ఆదిశేషమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకొని ఆమెను గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదిశేషమ్మ మృతి చెందింది. దీనిపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఈ హత్యకు ఒడిగట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: జగిత్యాలలో ఉద్రిక్తంగా మారిన చెరకు రైతుల ధర్నా

అపార్ట్​మెంట్​లో అర్ధరాత్రి డ్రగ్స్​ పార్టీ.. విదేశీ యువతుల అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.