ETV Bharat / crime

అతివేగానికి కుమారుడు బలి.. భర్తపై ఠాణాలో భార్య ఫిర్యాదు

తన భర్త నిర్లక్ష్యం, అతి వేగం ఆ తల్లికి కుమారుడిని దూరం చేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన పేగుబంధాన్ని బలితీసుకుంది. కళ్లెదుటే కన్నపేగు కన్నుమూస్తే.. ఆ తల్లి గుండెలవిసేలా రోధించింది. లే నాన్నా ఇంటికెళ్దామంటూ వెక్కివెక్కి ఏడ్చింది. కుమారుడిని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అతివేగానికి కుమారుడు బలి.. భర్తపై ఠాణాలో భార్య ఫిర్యాదు
అతివేగానికి కుమారుడు బలి.. భర్తపై ఠాణాలో భార్య ఫిర్యాదు
author img

By

Published : Jun 5, 2022, 9:53 AM IST

తన భర్త నిర్లక్ష్యం.. అతి వేగంతో కారు నడపడంతో కుమారుడు మృతి చెందాడని ఓ మహిళ శంకర్​పల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన రహీం(38), రేష్మ(30) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె ఆశ్యుబేగం(13), కుమారుడు రెహమాన్‌(10) ఉన్నారు. శుక్రవారం శంకర్‌పల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సాయంత్రం వచ్చి.. అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.

రహీం కారును అతివేగం, నిర్లక్ష్యంగా నడపడంతో శంకర్‌పల్లి మండలం కచ్చిరెడ్డిగూడ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద కారు బోల్తా పడింది. దీంతో కారులోని రెహమాన్‌(10) డోర్‌ నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడి మృతికి తన భర్త నిర్లక్ష్యమే కారణమంటూ భార్య రేష్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి..

పీకలదాకా తాగి.. కారుతో సీపీ కార్యాలయం గేటునే ఢీకొట్టారు..

తెలిసిన వారే బరితెగిస్తున్నారు.. అమ్మాయిలూ.. పారాహుషార్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.