Son in Law Killed his Father in Law: మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో మామ హత్య చేశాడో అల్లుడు. సంజయ గాంధీనగర్‌కు చెందిన రాజమౌళి మంగళవారం రాత్రి పాపిరెడ్డి నగర్‌లోని తన అల్లుడు బాలకృష్ణ ఇంటికి వెళ్లాడు. బాలకృష్ణ తండ్రి వివాహేతర సంబంధం విషయమై చర్చించుకున్నారు. అక్కడ మాటమాట పెరిగి గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ తన మామ రాజమౌళి మెడపై కత్తితో పొడిచాడు.
అప్రమత్తమైన కుటుంబసభ్యులు రాజమౌళిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: Constable Rape Attempt on Girl : కాపాడాల్సిన పోలీసే.. కాటేయబోయాడు!