Murder: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం విద్యుత్ నగర్‌లో సొంత అల్లుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. గండేపల్లి రమణమ్మ(46) అనే మహిళను అల్లుడు రమేష్ కత్తితో నరికి హతమార్చాడు. అడ్డువచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది దిలీప్పైన కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: పల్లె, పట్టణ ప్రగతి కార్యాచరణపై సీఎం కేసీఆర్ సమీక్ష