కొందరు వ్యక్తులు తాముంటున్న ఇంటిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారంటూ(warning to lawyer) హైకోర్టులో న్యాయవాదిగా(High court Lawyer) పనిచేస్తున్న కనకదుర్గ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఇద్దరు వ్యక్తులు సంఘ విద్రోహశక్తులతో కలిసి తమను చంపుతామని బెదిరిస్తున్నారని(warning to lawyer) మహిళా న్యాయవాది(High court Lawyer) ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం తాముంటున్న ఇంటిని 2017లో నిర్నల్ నివాస్ అపార్ట్‌మెంట్ పక్కనే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు.
అయితే ఈ నెల 9వ తేదీన రమేష్ గైక్వాడ్, అతని కుమారుడు రాహుల్ గైక్వాడ్ నకిలీ విద్యుత్, నీటి కనెక్షన్ బిల్లులు సృష్టించి ఇంటిని ఖాళీ చేయకపోతే చంపుతామంటూ బెదిరించారని మహిళా న్యాయవాది(High court Lawyer) ఆరోపిస్తున్నారు. తన భర్త బండి వరప్రసాదరావుతోపాటు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమకు తెలియకుండా జలమండలి, విద్యుత్ శాఖ కార్యాలయాలలో ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు(fake documents) పొందడం ద్వారా తాము 50 వేల రూపాయలు నష్టపోయామని పోలీసులకు వివరించారు. వీరిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: