అర్ధరాత్రి సమయం, పైగా జోరుగా వర్షం కురుస్తోంది. అందులోనే కరెంటు తీగ తెగిపడింది. ఎవరూ కూడా దానిని గమనించలేదు. అది అలా గాలిలో వేలాడుతూనే ఉంది. అదే సమయంలో శోభాయాత్రలో పాల్గొనడానికి వెళుతున్న వ్యక్తికి అది తగిలింది. అప్పటిదాకా వినాయక నిమజ్జనంలో హుషారుగా పాల్గొన్న ఆ వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతిచెందాడు. (Software Employee Died) ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. కొత్తూరు జెండా వద్ద కురిమిండ్ల సాయి... అర్ధరాత్రి 2 గంటల సమయంలో తెగి ఉన్న కరెంటు వైరు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అంతకుముందు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్‌పై తీసుకెళ్తుండగా కరెంటు వైరు తెగి కిందపడిపోయింది.
ఇది గమనించని కురిమిండ్ల సాయి... దానికి తగిలి అక్కడికక్కడే (Software Employee Died)చనిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కురిమిండ్ల సాయి పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా కొత్తూరు జెండాలోని ఇంటి వద్దే ఉంటూ జాబ్ చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది.
అర్ధరాత్రి కావడం... పైగా జోరుగా వర్షం కురవడం, గాలి వల్ల కరెంటు వైరు తెగి పడటం... గమనించని సాయి షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడం అతని బంధుమిత్రులకు తీవ్ర విషాదం మిగ్చిలింది.
ఇదీ చూడండి: