ఏపీలోని గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఓ మహిళ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో త్రాచు పాము కనిపించడంతో ఆమె కాసేపు భయాందోళనకు గురైంది. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి భయంతో కేకలు పెట్టి పరుగులు తీసింది. గమనించిన స్థానికులు.. వాహనంలో నుంచి పామును బయటకు తీసి హతమార్చారు.
ఇవీచూడండి: లైవ్ వీడియో: డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు!