ETV Bharat / crime

ganja smuggling : సంగారెడ్డి జిల్లా మీదుగా యథేచ్ఛగా గంజాయి రవాణా - గంజాయి రవాణా

ganja smuggling : ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి తరలించడానికి సంగారెడ్డి జిల్లా కొన్నేళ్లుగా గేట్‌వేగా మారింది. సంగారెడ్డి ప్రాంతం పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉండటంతో స్మగ్లర్లు డంపింగ్ పాయింట్‌గా ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యేకనిఘా పెట్టిన పోలీసులు.. తరచూ వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గంజాయి రవాణాదార్లు వేస్తున్న ఎత్తులను చిత్తు చేస్తున్నారు.

ganja smuggling : సంగారెడ్డి జిల్లా మీదుగా యథేచ్ఛగా గంజాయి రవాణా

author img

By

Published : Jan 27, 2022, 4:44 AM IST

ganja smuggling : సంగారెడ్డి జిల్లా మీదుగా యథేచ్ఛగా గంజాయి రవాణా

ganja smuggling : సంగారెడ్డి జిల్లా ఒకప్పుడు గంజాయి సాగుకు చిరునామాగా ఉండేది. సరైన రవాణా సౌకర్యాలు లేని నారాయణఖేడ్ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో పండించేవారు. స్థానిక గిరిజనులు, పేద రైతులకు డబ్బు ఆశ చూపి అక్రమార్కులు గంజాయి సాగు చేయించేవారు. వీరికి కొంతమంది స్థానిక రాజకీయ నాయకుల అండదండలు సైతం ఉండటంతో ఎలాంటి అంటంకం లేకుండా సాగు చేసేవారు. మారిన పరిస్థితుల దృష్ట్యా ఈప్రాంతంలో సాగు దాదాపు ఆగిపోయింది.

వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

సంగారెడ్డి జిల్లాలో సాగు నిలిచిపోవడంతో స్మగ్లర్లు విశాఖ మన్యం నుంచి గంజాయి తెప్పిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలతో సరిహద్దు ఉన్న సంగారెడ్డి జిల్లాను డంపింగ్ పాయింట్‌గా మార్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను అడ్డాలుగా పెట్టుకుని.. ఇక్కడి నుంచి బీదర్, గుల్బర్గ, ముంబయి, సోలాపూర్, నాందేడ్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మత్తుపదార్థాలపై కఠినంగా వ్యవహరిస్తుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సంగారెడ్డి ప్రాంతాన్ని అంతరాష్ట్ర రవాణా మార్గంగా ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అదనంగా సిబ్బందిని ఇచ్చి గంజాయి వినియోగించేవారి సమాచారం సేకరించారు. వారి నుంచి గంజాయి అమ్మేవారు, వారికి సరఫరా చేసే వారు ఇలా.. పూర్తి వివరాలు రాబట్టారు. అనుమానితులపై నిఘా పెంచారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో తరచూ వందల కేజీల గంజాయి పట్టుపడుతోంది. బుధవారం ఒక్క రోజే రెండు చోట్ల భారీగా సుమారు 2 కోట్ల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఓ లారీలో రాజమండ్రి నుంచి నాందేద్‌కు తరలిస్తున్న వెయ్యి కిలోలు స్వాధీనం చేసుకున్నారు.

ఎత్తులను చిత్తు చేస్తున్న పోలీసులు

అనుమానితుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన పోలీసులు... వారి ఆట కట్టిస్తున్నారు. గంజాయి రవాణా కోసం స్మగ్లర్లు వేస్తున్న ఎత్తులను చిత్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం లారీలో ఇనుప తుక్కు కింద దాచి తరలిస్తున్న పది టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఓ ట్రక్కులో కింది భాగంలో రహస్యంగా క్యాబిన్ ఏర్పాటు చేసి తరలిస్తున్న గంజాయిని సైతం గుర్తించారు. వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు సైతం నమోదు చేస్తున్నారు. 15రోజుల క్రితం తమిళనాడుకు చెందిన రాజా స్టాలిన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు పంపారు.

ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా పోలీసుల కళ్లుగప్పి ఇంకా వేలాది కిలోల గంజాయి సంగారెడ్డి జిల్లా గుండా అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.