ETV Bharat / crime

boy died: నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడి మృతి - TELANGANA LATST CRIME NEWS

పొట్టచేత పట్టుకుని... తమ ఆరుగురి సంతానం కడుపునింపేందుకు ఓ గ్రామానికొచ్చారు ఆ దంపతులు. పని దొరకడంతో ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకొని కూలీకి వెళ్లారు. ఇంటి వద్దే ఆడుకుంటున్న తమ ఆరేళ్ల చిన్న కుమారుడు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి మరణించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

six-year-old-boy-dies-in-mahaboobabad-district
నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడి మృతి
author img

By

Published : Jul 21, 2021, 2:44 PM IST

అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడు... ఆడుకుంటూ వెళ్లి అనంతవాయువుల్లో కలిసిపోయాడు. ఇంటి పక్కన సెప్టిక్ ట్యాంకు కోసం తీసిన గుంతే... బాబు పాలిట యమపాశంగా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సిరిపాటి సాయిరాం, పూలమ్మలకు ఆరుగురు సంతానం. తల్లిదండ్రులు ఇద్దరూ... ఇద్దరు పిల్లలను తీసుకొని కూలీపనికి వెళ్లారు. మిగిలిన నలుగురు పిల్లలు ఇంటి వద్దే ఉన్నాకు. అందులో భాగంగానే చిన్న కుమారుడు మహంకాళి(6) నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకని బయటకి వెళ్లాడు.

సెప్టిక్ ట్యాంకు కోసం తీసిన గుంతలో...

సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊరంతా వెతికారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ రోడు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఇంటిపక్కనే సెప్టింక్ ట్యాంకు కోసం ఓ గుంత తీశారు. వర్షం కారణంగా... ఆ గుంతలో నీరు నిండిపోయింది. పోలీసులకు అనుమానం వచ్చి అందులో గాలించగా... మహంకాళి మృతదేహం లభ్యమైంది. ఇన్నాళ్లూ ప్రాణంగా పెంచుకున్న కుమారుడు గుంతలో నిర్జీవంగా పడి ఉండడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు... కన్నీరుమున్నీరయ్యారు.

గుంతలోంచి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు...

అనంతరం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబు తల్లిదండ్రులు... పొట్ట కూటి కోసం ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తారు. డబ్బులు లేకపోయినా పిల్లలను చూసుకొని ఆనందంగా గడిపారని... ఇప్పుడు తమ ముద్దుల కుమారుడు చనిపోవడం బాధగా ఉందని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చూడండి: Cyber Fraud: డేటింగ్​ పేరుతో వలపు వల.. 77 ఏళ్ల వృద్ధునికి 11 లక్షలు టోకరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.