ETV Bharat / crime

మద్యం మత్తులో డివైడర్​ను ఢీకొట్టిన కారు... ఆరుగురికి తీవ్రగాయాలు - రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు

Road Accident: మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంగా కారును నడుపుతూ.. అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టారు. ప్రమాదంలో కారు పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న డీసీఎంను తాకింది. ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Road Accident
Road Accident
author img

By

Published : May 15, 2022, 10:49 AM IST

Road Accident: సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో యువకులు కారు నడపడంతో... కట్టకొమ్ముగూడెం వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న డీసీఎంను తాకింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు హుజూర్​నగర్​ పట్టణానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన కారులో మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..:

అందమే పెట్టుబడి.. బలహీనతే రాబడి.. ప్రేమ ముసుగులో కి'లేడి' మోసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.