వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు వరంగల్-ఖమ్మం రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాటిన అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారంతా ఖమ్మం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య