రాఖీ పండుగ ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీ కట్టేందుకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. కానీ ఆ అన్న రాత్రికి రాత్రే కన్నుమూశారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతపల్లికి చెందిన లక్ష్మయ్యకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు. రాఖీ కట్టడానికి సోదరుడి వద్దకు వచ్చారు. రాత్రి సమయంలో లక్ష్మయ్య అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతిచెందారు.
ఈ విషాదఘటనతో రాఖీ కట్టడానికి వచ్చిన సోదరీమణులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేస్తుండగా సోదరుడికి చివరసారి రాఖీలు కట్టి తుది వీడ్కోలు పలికారు. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. తోబుట్టువుల పండుగ(Raksha Bandhan) నాడే ఇలా జరగడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగపూట మరణించిన అన్న దగ్గర ఆ సోదరీమణులు విలపించిన తీరు కంటతడి పెట్టిస్తోంది.
ఇదీ చదవండి: Accident: నాలుగు రోజుల్లో పెళ్లి.. పత్రికలు పంచడానికి వెళ్లి...