ETV Bharat / crime

sisters died in road accident: 'తప్పతాగాడు.. బండిపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లను గుద్ది చంపాడు..' - moinabad accident

sisters died in road accident: రోడ్డు ప్రమాదం.. రోడ్డున పోయే వారికి ఇవాళ ఇదొక చిన్న విషయం. ప్రమాదానికి కారణమైన వారికి మహా అయితే ఒకరోజు ఆందోళన. అదే ఆ ప్రమాదం బారిన పడిన వారికి జీవన్మరణం. ఇక వారిపై ఆధారపడిన వారో... లేదంటే ఆ బాధను మోసే వారికైతే జీవితకాలం ప్రత్యక్ష నరకం. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.... ఎంతో మంది కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా.... పక్కకెళ్లిన మరుక్షణమే బేఖాతరు చేస్తున్నారు. తాజాగా మెయినాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. అసలే మద్యం మత్తు ఆపై అతివేగంగా వెరసి రెండు నిండు ప్రాణాలు బలవగా మరో అమ్మాయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

accident a  bijapur highway
రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి
author img

By

Published : Dec 27, 2021, 1:22 PM IST

Updated : Dec 27, 2021, 2:23 PM IST

sisters died in road accident: అసలే మద్యం మత్తు.. ఆపై అతివేగం.. వెరసి రెండు నిండు ప్రాణాలు బలవగా... మరో అమ్మాయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మోరె లక్షణ్‌ మండల కేంద్రంలో నివాసముంటున్నారు. ఈయన పెద్ద కుమార్తె సౌమ్య మెహిదీపట్నంలో డిగ్రీ చదువుతుండగా చిన్నకుమార్తె ప్రేమిక ఎన్​టీఆర్ మోడల్‌ స్కూల్‌లో చదువుతోంది. లక్ష్మణ్‌ సోదరుడు రెడ్డిపల్లి ఎంపీటీసీ అయిన శ్రీనివాస్‌ కుమార్తె అక్షయతో కలిసి సౌమ్య, ప్రేమికలు శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై బయటికి వెళ్లారు. కనకమామిడి వీరు వెళ్తుండగా బీజాపూర్‌ రహదారిపై చేవెళ్ల నుంచి హైదరాబాద్‌ వైపు వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన సౌమ్య, అక్షయలను ఆస్పత్రికి తరలించారు.

accident a  bijapur highway
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అక్కాచెల్లెళ్లు

చావు ముంగిట మరో యువతి
road accident on bijapur highway: పరిస్థితి విషమించటంతో ఇద్దరు అమ్మాయిలను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఇవాళ సౌమ్య చనిపోయింది. తీవ్రగాయాలపాలైన అక్షయకు చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోగా... మరో యువతి ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల మృతితో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా ప్రమాదానికి కారణమైన కారును నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే మద్యం సేవించటం ఆపై అతివేగంగా కారు నడపటమే ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు.

Last Updated : Dec 27, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.