దిశ నిందితుల ఎన్కౌంటర్లో ( Disha Encounter Case News) బుల్లెట్లు ఎంత దూరం దూసుకొచ్చాయని.. మృతుల శరీరంలో బుల్లెట్లు వెనక నుంచి దిగాయా లేక ముందు వైపు నుంచి లొపలకి దూసుకెళ్లాయా? అని దిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సుధీర్ గుప్తాను సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది.
బాలిస్టిక్ రిపోర్టు సమయానికి అందక పోవడం వల్ల ఆ వివరాలు చెప్పలేనని సుధీర్ గుప్తా.. కమిషన్‌కు(sirpurkar commission) సమాధానం ఇచ్చారు. గాంధీ ఫోరెన్సిక్ హెచ్ఓడీ కృపాల్ సింగ్‌ను కూడా సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. ఎన్ కౌంటర్‌కు సంబంధించిన సమాచారం మీకెవరిచ్చారు...? సంఘటనా స్థలానికి ఎన్ని గంటలకు చేరుకున్నారు? జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం నిర్వహించారా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోలీస్ వాహన డ్రైవర్ యాదగిరిని దాదాపు 3 గంటల పాటు కమిషన్ విచారించింది.
నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లిన తర్వాత... ఎక్కడున్నావని.... కాల్పులు జరిగిన తర్వాత ఎంత సేపటికి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయావని డ్రైవర్ యాదగిరిని కమిషన్ ప్రశ్నించింది. పోలీసు అధికారులు వాహనం తీసుకెళ్లమని చెప్పిన తర్వాత....అక్కడి నుంచి బయలుదేరి... హెడ్ క్వార్టర్స్‌లో వాహనం పెట్టినట్లు యాదగిరి తెలిపారు.
షాద్‌నగర్ పరిధిలోని మీర్జాగూడలో ఉన్న ప్రైవేట్ అతిథి గృహం నుంచి నలుగురు నిందితులను డ్రైవర్ యాదగిరి 6న తెల్లవారుజామున పోలీసు బందోబస్తు మధ్య చటాన్ పల్లి తీసుకెళ్లారు. నిందితులను ఏ మార్గంలో తీసుకెళ్లారు, అతిథిగృహం నుంచి సంఘటనా స్థలానికి ఎంత దూరం ఉందనే వివరాలను డ్రైవర్ యాదగిరి నుంచి కమిషన్ సభ్యులు సేకరించారు.
ఇదీ చూడండి: