ETV Bharat / crime

మనస్తాపంతో సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం - శ్రీరాముల పల్లి సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

మనస్తాపంతో ఓ సర్పంచ్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాముల పల్లిలో జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

suicide attempt
sriramulapalli sarpanch
author img

By

Published : Apr 8, 2021, 8:08 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీ రాములపల్లి గ్రామ సర్పంచ్ ముంజ మంజుల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాస రెడ్డి సమక్షంలో గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నిర్మాణంలో వెచ్చించిన నిధుల విషయంలో గ్రామ సర్పంచ్​కు, గ్రామ కార్యదర్శి తులసికి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

గొడవతో మనస్తాపం చెందిన సర్పంచ్ మంజుల... పంచాయతీకి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. హుటాహుటిన కరీంనగర్​లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

ఇదీ చూడండి: మొన్న భర్త.. నేడు భార్య.. అనాథలైన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.