ETV Bharat / crime

మద్యం మత్తులో ఎస్సై వీరంగం.. స్నేహితులతో కలిసి బ్లూకోల్ట్స్ సిబ్బందిపై దాడి - బ్లూకోర్ట్ సిబ్బందిపై ఎస్సై తిరుపతి దాడి

SI Halchal in Mancherial: పూటుగా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు ఓ ఎస్సై. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరచి.. తన స్నేహితులతో కలిసి బ్లూ కోల్ట్స్​​ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో అక్కడి నుంచి జారుకున్నాడు.

SI Halchal in Mancherial
SI Halchal in Mancherial
author img

By

Published : Oct 26, 2022, 10:20 AM IST

Updated : Oct 26, 2022, 5:21 PM IST

మంచిర్యాలలో మధ్యరాత్రి ఎస్సై వీరంగం.. స్నేహితులతో కలిసి బ్లూకోర్ట్ సిబ్బందిపై దాడి

SI Halchal in Mancherial: మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించిన ఓ ఎస్సై విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆవుల తిరుపతి.. తన స్నేహితులతో కలిసి మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద రోడ్డుపై మద్యం సేవిస్తూ, కారులో పాటలకు అనుగుణంగా డాన్సులు చేయడం జరిగింది. ఎస్సై చేస్తోన్న చేష్టలకు ఇబ్బందికి గురైన స్థానికులు 100 ఫోన్​ చేసి సమాచారం ఇచ్చారు.

దీంతో బ్లూ కోల్ట్స్​ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై తిరుపతిని ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఉన్న ఎస్ఐ.. పోలీస్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ.. స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డారు. స్థానికులు, ఇతరులు వచ్చి దాడిని ఖండించగా ఎస్సై, ఆయన స్నేహితులు అక్కడ నుంచి పరారయ్యారు. దాడిలో ఉస్మాన్ అనే కానిస్టేబుల్​కు గాయాలయ్యాయి. పోలీస్ ఉన్నతాధికారిగా ఉంటూ.. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడడంపై మంచిర్యాల పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 26, 2022, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.