ETV Bharat / crime

BRIBE: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, రైటర్​

జగిత్యాల జిల్లా కథలాపూర్​ పోలీస్​స్టేషన్​లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.10వేలు లంచం తీసుకుంటూ ఎస్సై పృథ్వీదర్​ గౌడ్​, రైటర్​ రమేష్​ అధికారులకు చిక్కారు.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, రైటర్​
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, రైటర్​
author img

By

Published : Jun 28, 2021, 5:34 AM IST

ఇసుక ట్రాక్టర్​ను విడిచేందుకు 10వేల రూపాయలు లంచం తీసుకుంటూ కథలాపూర్ ఎస్సై పృథ్వీదర్ గౌడ్, రైటర్ రమేష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేట వాసి నాగరాజుకు చెందిన ఇసుక ట్రాక్టర్​ను కథలాపూర్ పీఎస్​ పరిధిలో పట్టుకొని స్టేషన్​కు తరలించారు. ట్రాక్టర్​ను ఇప్పించాలని పలుమార్లు నాగరాజు పీఎస్​ పోలీస్ స్టేషన్​కు వెళ్లి వేడుకుంటే.. రూ.10 వేలు ఇవ్వాలని ఎస్సై పృథ్వీదర్ గౌడ్ డిమాండ్ చేశారని బాధితుడు తెలిపాడు.

దీనితో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు నాగరాజు తెలిపాడు. ఆదివారం ట్రాక్టర్ కోసం నాగరాజు 10వేలు తీసుకుని పీఎస్​కు వెళ్లగా.. ఎస్సై ఆ డబ్బును తీసుకోకుండా తన రైటర్​ రమేష్​కు ఇవ్వాలని సూచించారు. నాగరాజు రైటర్​ రమేష్​కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఎస్సై పృథ్వీరాజ్​ను, రైటర్​ రమేష్​ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: ACCIDIENT: డివైడర్​ని ఢీకొట్టిన కారు... తల్లి, కుమారుడు మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.