అఫ్ఘనిస్థాన్ దేశానికి చెందిన మహ్మద్ షఫీ ఇబ్రహీఖిల్ అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో హర్యాణాలోనీ ఫిరీదాబాద్ వెళ్లేందుకు వచ్చిన ఇతను నకిలీ ఆధార్ కార్డును కల్గి ఉన్నాడు.
అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా... పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందుతుడి పాస్ పోర్ట్ నెంబర్ P03549256 కాగా... ఆధార్ కార్డు నెంబర్ 695523883716 గా ఉంది. ఆధార్ కార్డులో ఢీల్లీలోని సఫియుల్లా లాజ్ పత్ నగర్ అడ్రస్ కలిగి ఉంది.
ఇదీ చదవండి: పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా.. రెండ్రోజుల్లో 150కి పైగా కేసులు