కారును లారీ ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి ములుగు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దాని వెనుకనే వస్తున్న మరో లారీ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ఉపాధ్యాయులు, డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరు లారీ డ్రైవర్లకు స్వల్వగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ములుగు జిల్లా చల్వాయి ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు మహిళా ఉపాధ్యాయులు గణతంత్ర దినోత్సవ వేడుకలను ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదంలో కారు, లారీల ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలను క్రమబద్దీకరించారు.