ETV Bharat / crime

Warangal Liquor Don: వరంగల్​లో పోలీసుల పేరుతో దందాలు.. అంతా వారి సహకారంతోనే! - Liquor Don

వరంగల్‌ మిల్స్‌కాలనీలో లిక్కర్‌డాన్‌ కుమారుడి (Warangal Liquor Don son)పై అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కేసు నమోదైంది. పోలీసుల విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత సదరు వ్యక్తితో సంబంధం ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Warangal Liquor Don
Warangal Liquor Don
author img

By

Published : Sep 28, 2021, 11:03 AM IST

కొంతమంది పోలీస్‌ అధికారులతో వరంగల్ లిక్కర్‌డాన్‌ కుమారుడు (Warangal Liquor Don son) దోస్తానా చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. సదరు అధికారులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించి వారి నుంచి లబ్ధి పొందేవాడని గుర్తించారు. అవసరమైతే బ్యాంకాక్‌, శ్రీలంక లాంటి దేశాలకు పంపించేవాడని.. ప్రతిఫలంగా లిక్కర్‌డాన్‌ కుమారుడు (Warangal Liquor Don son ) ఏది చెబితే అది చేసేవారని సమాచారం. ఇంటికి విందుల కోసం పిలిచి విదేశీ మద్యం అందించేవాడు.. ఎవరైనా అప్పు ఇస్తే వారికి తిరిగి ఇవ్వకుండా సదరు పోలీసు అధికారుల పేరును వాడుకొని బెదిరింపులకు పాల్పడేవాడని సమాచారం. మరో యువతిని కూడా ట్రాప్‌ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇతర దేశాలకు వెళ్లి అక్కడ క్యాసియోనా లాంటి ఆటలు ఆడేవాడు, డాన్‌ కుమారుడు (Warangal Liquor Don son ) కటింగ్‌ చేయించుకోవడానికి హైదరాబాద్‌కు వెళ్లి వచ్చేవాడు, సుమారు రూ.10 నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు చేసేవాడు.

గతంలో వరంగల్‌ పోలీసు డివిజన్‌లో పనిచేసిన అధికారులు, ప్రస్తుతం ఉన్నవారితోనూ డాన్‌ కుమారుడు (Warangal Liquor Don son ) సన్నిహితంగా ఉంటూ ఎదుటి వారిని బెదిరించినట్లు సమాచారం. కొంతమంది పోలీసు అధికారులతో కలిసి వ్యాపారాలు సైతం చేస్తున్నట్లు గుర్తించారు. ఇది పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ గల పోలీసు అధికారులు ఇలాంటి వారితో సంబంధాలు పెట్టుకోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలను సేకరించాలని ప్రత్యేక విభాగానికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత సదరు వ్యక్తితో సంబంధం ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేసుతో నిందితుడు పోలీసులకు పట్టబడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

సయోధ్యకు యత్నం

లిక్కర్‌డాన్‌ తన కుమారుడి (Warangal Liquor Don son)ని కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది తన అనుచరులను శనివారం యువతి ఇంటికి పంపించి బేరసారాలు జరిపినట్లు తెలిసింది. ఆ యువతి మాత్రం తన వద్ద తీసుకున్న డబ్బులు, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని తెల్చిచెప్పినట్లు తెలిసింది. ఇంత కాలం తనను తిట్టి ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం.

మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు

బాధిత యువతి పలుసార్లు ఠాణాలకు వెళ్లినా న్యాయం జరగలేదు. నిందితుడి (Warangal Liquor Don son)కి పోలీసు అధికారులతో సంబంధాలు ఉండడమే ఇందుకు కారణం. దీంతో సదరు యువతి మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో వారు నేరుగా పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని మిల్స్‌కాలనీ పోలీసులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు.

పరారీలో నిందితుడు

నిందితుడి (Warangal Liquor Don son) కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం దాటి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కొంతమంది పోలీసు అధికారులు ఇందుకు సహకరించినట్లు సమాచారం. లిక్కర్‌డాన్‌ (Warangal Liquor Don)మాత్రం తన పలుకుబడి ఉపయోగించుకొని కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇదీ చూడండి: లిక్కర్​ పారబోస్తే.. ఐదేళ్ల వరకు తాగుడు బంద్​!

డ్రగ్స్ డాన్​ కోసం పోలీసుల స్కెచ్- 10 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.