ETV Bharat / crime

KTPP fire accident: కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం - కేటీపీపీలో అగ్ని ప్రమాదం

KTPP fire accident
కేటీపీపీలో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 25, 2022, 9:21 PM IST

Updated : Apr 26, 2022, 5:37 AM IST

21:18 April 25

KTPP fire accident: కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్ధితి విషమంగా ఉన్న మరో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం...హైదరాబాద్ తరలించారు.
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం....చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ సయమంలో విధుల్లో ఉన్న ఏడుగురు గాయపడ్డారు. బాధితుల్లో జెన్‌కో ఉద్యోగులతోపాటు ఒప్పంద కార్మికులున్నారు. 500 మెగావాట్ల బాయిలర్ వద్ద ఉండే మిల్లర్ ఒక్కసారిగా పేలిపోవడంతో...ఈ దుర్ఘటన సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో.. ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు తీవ్రతకు కార్మికులు....అల్లంత దూరంలో ఎగరిపడ్డారు. మంటల్లో చిక్కుకున్నవారు... ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకడంతో కాళ్లు చేతులు విరిగాయి.

కాళ్లు చేతులు...మొహం, వీపుభాగం కాలి కార్మికులు నరకయాతన పడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి...అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 60 శాతానికిపైగా కాలిన గాయాలతో పరిస్ధితి విషమంగా ఉన్న... వెంకటేశ్వర్లు, వీరస్వామి, సీతారాములను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన ఒప్పంద కార్మికులు రాజు, సాయికుమార్, మహేందర్ జానికిరామ్‌లు హనుమకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉందోనని బాధిత కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు.

ప్లాంట్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించినట్లుగా కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తొలుత చిన్నగా మంటలు వచ్చినా....తేలిగ్గా తీసుకోవడంతో....మిల్లర్ పేలి...భారీ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే...ప్రమాదం జరిగి ఉండేదికాదని అభిప్రాయపడుతున్నారు. ఘటనపై జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు... తీవ్రంగా స్పందించి..కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదో వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి దారి తీసిన కారణాలను తెలుసుకునేందుకు జెన్కో ప్రత్యేక బృందం...ఇవాళ ప్లాంట్‌ను సందర్శించనుంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో రాజకీయ కాకరేపుతున్న ప్రశాంత్‌ కిశోర్‌ వ్యవహారం

ఈ-బైక్​లో మంటలు.. లక్కీగా కొద్ది నిమిషాల ముందే...

Last Updated : Apr 26, 2022, 5:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.