నిషేధిత గుట్కా నిల్వ ఉంచిన గోదాంపై పోలీసులు దాడి చేసి భారీగా గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కాను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
కుల్సుంపుర ముస్తాయద్‌పురకు చెందిన షకీల్ గుట్కాను గోదాంలో నిల్వచేస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా... గోదాంలో మూడు క్వింటాళ్ల గుట్కా లభించింది. ఈ మేరకు పోలీసులు షకీల్‌ను అరెస్టు చేసి గుట్కా స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం