నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కుమ్మన్ పల్లి గ్రామ శివారులో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన మందర్నా గ్రామానికి చెందిన మాధవ్‌రావు(21) ఇసుక ట్రాక్టర్‌తో కుమ్మన్‌పల్లి వైపు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు అదుపుతప్పి పంటపొలాల్లో పడింది. ట్రాక్టర్ ఇంజిన్ కింద యువకుడు పడడంతో అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు.
ఇసుక తరలించడానికి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మార్గంలో రవాణా చేస్తూ.. ప్రాణాలను పోగొట్టుకున్నాడు. మంజీర పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక దందా కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు