ETV Bharat / crime

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా... అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి - కత్తులతో దాడి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాగులో ఇసుకను తరలించవద్దని అడ్డుకున్నందుకు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానుకులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

sand mafia attacking with knives on villager at mahabubnagar district
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా... అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి
author img

By

Published : Apr 16, 2021, 1:49 PM IST

Updated : Apr 16, 2021, 2:26 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా వాడ్యాల గ్రామానికి అనుకుని ఉన్న దుందుభి వాగులో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారు. అక్కడే పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు ఇసుక నింపవద్దని అడ్డుకున్నారు. ట్రాక్టర్ల యజమానులు వారిపై దాడిచేయగా.. ఒకరు తప్పించుకుని వచ్చి గ్రామస్తులకు సమాచారమిచ్చి మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా... అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి

కత్తులతో దాడి..

ఈ క్రమంలో ట్రాక్టర్ల యజమానులు కొందరు మధుకు ఫోన్‌చేసి రైతులపై తాము దాడి చేశామని, వీలైతే అడ్డుకోవాలని రెచ్చగొట్టడంతో జడ్చర్లలో ఉన్న మధు అర్థరాత్రి తర్వాత గ్రామానికి చేరుకున్నారు. కొందరు రైతులను కలుపుకుని వాగు వైపు వెళ్తుండగా ట్రాక్టర్ యజమానులు అడ్డుపడ్డారు. ఇరువర్గాల మధ్య పరస్పర వాగ్వాదం జరుగుతుండగా మధుపై ట్రాక్టర్ యజమానులు కత్తులతో దాడి చేశారు. నాలుగు చోట్ల కత్తులతో గాయపరచారు. తీవ్రంగా గాయపడ్డ మధును జిల్లా ఆసుపత్రికి తరలించారు.

బాధితుడిని మహబూబ్‌నగర్ ఆర్డీవో పద్మశ్రీ, మిడ్జిల్ తహశీల్దార్ పరామర్శించారు. ఘటనపై గ్రామానికి వెళ్లి విచారణ చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీధర్ మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరు నెలలుగా దుందుభి వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

ఇదీ చూడండి: లైవ్ వీడియో- చేపల వేటకు వెళ్లి నీటిలో గల్లంతైన వ్యక్తి

Last Updated : Apr 16, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.