ETV Bharat / crime

జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు

ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. నిర్మల్​ జిల్లాలోని సుద్దవాగు నుంచి రోజూ వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు అక్రమ రవాణా చేస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన సమీప గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.

sand illegal smuggling in nirmal district
జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు
author img

By

Published : Feb 24, 2021, 5:29 PM IST

నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భైంసా సుద్దవాగు నుంచి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన సుద్దవాగు చుట్టుపక్కల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు దేవుని పేరు మీద బిల్లు బుక్కులు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ. 1000 నుంచి 1400 వరకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వసూలు చేస్తున్నారు. భైంసా మండలంలోని మాటేగాం, బొరిగాం, పెండ్​పల్లి, వాట్తోలి, ఎగ్గం, కద్గాం, లోకేశ్వరం మండలంలోని హాద్ గాం, అవర్గా తదితర గ్రామాల పరిధిలో జోరుగా వసూళ్లు సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: బైక్​ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.