RTC bus accident at Peddapally district: పెద్దపల్లి జిల్లా మంథని-తాడిచర్ల రహదారిలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరగడంతో ప్రమాదం చోటు చేసుకొంది.. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మంథని నుంచి తాడిచర్లకు వెళుతున్న నైట్ హాల్ట్ బస్సులో 41మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇసుక లారీల కారణంగా రహదారిలో గోతులు పడటంతో మంథని డిపోకు చెందిన బస్సు స్టీరింగ్ విరిగింది.
ఈ ఘటనతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొంది. ఇందులో ప్రయాణిస్తున్న 16మందికి గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని అటుగా వస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తన కాన్వాయ్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా వారిని సంఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స జరిపించి ఇళ్లకు పంపించారు.
ఇవీ చదవండి: