ETV Bharat / crime

డీసీసీబీలో రూ.2.86 కోట్ల కుంభకోణం.. 4మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులపై వేటు - డీసీసీబీ లో కుంభకోణం

DCCB scam in Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రూ. 2.86కోట్ల కుంభకోణం చోటుచేసుకుంది. బేల బ్రాంచిలో గుట్టచప్పుడు కాకుండా జరిగిన ఈ దందా ఆదిలాబాద్‌ రూరల్‌, భీంపూర్‌, జన్నారం బ్రాంచీలతో పాటు ఆదిలాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి విస్తరించింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు నలుగురు మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటుపడటం సంచలనం సృష్టించింది.

DCCB scam
డీసీసీబీలో కుంభకోణం
author img

By

Published : Mar 10, 2022, 6:27 PM IST

DCCB scam in Adilabad: ప్రభుత్వ సొమ్మును భద్రంగా కాపాడాల్సిన జిల్లా కేంద్ర సహాకార బ్యాంకు(డీసీసీబీ)లో రూ. 2.86 కోట్ల కుంభకోణం చోటుచేసుకుంది. బేల బ్రాంచిలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ దందా ఆదిలబాద్‌లో ప్రధాన బ్యాంకు, ఆదిలాబాద్‌ గ్రామీణం, భీంపూర్, జన్నారం బ్రాంచీలకు విస్తరించింది. నలుగురు మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. రైతుల నుంచి అప్పులను బలవంతంగా వసూలు చేసే జిల్లా అధికారులు సొంత బ్రాంచీలపై సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే అక్రమాలకు దారితీసినట్లు వెల్లడవుతోంది.

అసలేం జరిగిందంటే...

DCCB Bank scam: బేల బ్రాంచిలో స్టాఫ్‌ అసిస్టెంట్‌ కం క్యాషియర్‌గా పనిచేసే శ్రీపతి కుమార్‌ అదే బ్రాంచి వేునేజర్‌ రాజేశ్వర్, అసిస్టెంట్‌మేనేజర్‌ రణిత ఐడీలతో గతేడాది సెప్టెంబర్‌ 13 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వరకు విడతలవారీగా రూ.2.86కోట్లు తన కుటుంబీకుల ఖాతాల్లో జమచేశారు. అక్కడితో ఆగకుండా ఆదిలాబాద్‌లోని డీసీసీబీ, ఆదిలాబాద్‌ గ్రామీణం, భీంపూర్, జన్నారంలో పనిచేసే నలుగురు మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించాడు. గుట్టుచప్పుడుకాకుండా జరిగిన ఈ ఘటనను అధికారయంత్రాంగం పసిగట్టలేకపోయింది. ఈనెల 7న బ్యాంకు తరఫున చార్టెడ్‌ అకౌంటెంట్‌ జరిపిన సాధారణ ఆడిట్‌లో రూ.2.86కోట్ల వోచర్లు లేకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ తరువాత డీసీసీబీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు నాగాంజలి, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విచారణలో డబ్బులు కాజేసిన విషయం వెళ్లడైంది. ఆర్థిక నేరంగా భావించిన ఉన్నతాధికారులు ఆయా బ్యాంకుల్లోని నలుగురు మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కేసు విచారణను సీఐడీ అధికారులకు నివేదిస్తామని డీసీసీబీ సీఈవో శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

సస్పెండైన ఉద్యోగులుహోదాబ్రాంచి
శ్రీపతి కుమార్‌ స్టాఫ్‌ అసిస్టెంట్‌ బేల
రాజేశ్వర్ మేనేజర్‌ బేల
రణితఅసిస్టెంట్‌ మేనేజర్‌ బేల
ఏ.రాహుల్‌ స్టాఫ్‌ అసిస్టెంట్ బేల
బి.వేణుగోపాల్‌ మేనేజర్‌ జన్నారం
జి.ప్రవీన్‌కుమార్‌స్టాఫ్‌ అసిస్టెంట్జన్నారం
కె.రమేష్‌అటెండర్‌ భీంపూర్‌
ఎస్‌.ప్రవీన్‌ మేనేజర్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయం
ఎం.నితిన్‌ స్టాఫ్‌ అసిస్టెంట్‌ డీసీసీబీ ప్రధాన కార్యాలయం
ఎం.సవితమేనేజర్‌ ఆదిలాబాద్‌ రూరల్‌ బ్రాంచి
బి.రమేష్‌ స్టాఫ్‌ అసిస్టెంట్‌జన్నారం

నిబంధనలు:

DCCB Bank scam: బ్యాంకు డబ్బులను ఇతరుల ఖాతాల్లోకి మళ్లించాలంటే ఆ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారులు సంయుక్తంగా తమ సొంత పాస్‌వర్డ్‌/ఐడీతో లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క అధికారి చేసినా ఉద్యోగులు తప్పుడు పాస్‌వర్డ్‌/ఐడీని వినియోగించినా ఖాతా తెరుచుకోదు. లావాదేవీలు జరగవు. అందుకే ప్రతి శాఖలో డబ్బుల లావాదేవీలపై ఇద్దరు అధికారులకు సంయుక్త అజమాయిసీ ఉంటుంది. బేలలో స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీపతికుమార్‌ అదే బ్యాంకు మేనేజర్‌ రాజేశ్వర్, అసిసెంట్‌ మేనేజర్‌ రణితలకు తెలియకుండా వారి ఐడీలతో బ్యాంకు సొమ్మును ఎలా దారిమళ్లించాడనేది సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది.

ఆర్థికనేరమిది..

'బేల కేంద్రంగా జరిగిన అక్రమాలు ఆర్థిక నేరం కిందకు వస్తాయి. 5మేనేజర్లతో సహా 11 మందిని సస్పెండ్‌ చేశాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రూ. లక్షలోపైతే జిల్లా పోలీసులకు, రూ.లక్ష నుంచి రూ.3కోట్ల వరకైతే రాష్ట్రసీఐడీకీ, రూ. 3కోట్లపైన దుర్వినియోగం జరిగితే సీబీఐ విచారణ జరిపించాల్సి ఉంది. మూడువారాల్లోగా ఆర్‌బీఐకి నివేదిక సమర్పించి శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.'

-శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ సీఈవో

ఇలాంటి దందా కేవలం అయిదుబ్రాంచీలకే పరిమితమైందా..? ఉమ్మడి జిల్లాలోని మరో 39 బ్రాంచిల్లో ఎక్కడైన అక్రమాలు జరిగాయా.? అనే కోణంలో అటు పాలకవర్గంతోపాటు ఇటు అధికారయంత్రాంగం ఆరాతీస్తుండటం ప్రాధాన్యతాంశంగా మారింది.

ఇదీ చదవండి:సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ పరిచయం.. రూ. లక్షన్నర మోసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.