ETV Bharat / crime

Delhi liquor case: ఏడుగురు నిందితులకు సమన్లు జారీ - telangana latest news

Delhi liquor case update: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. విజయ్‌నాయర్‌ సహా ఏడుగురు నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన చార్జిషీట్‌ను.. రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. సుమారు 10 వేల పేజీలతో తొలి అభియోగపత్రాన్ని.. గతనెల 25న సీబీఐ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఏడుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది.

Delhi liquor case update
Delhi liquor case update
author img

By

Published : Dec 15, 2022, 10:13 PM IST

Delhi liquor case update: దిల్లీ మద్యం కుంభకోణంలో.. విజయ్‌నాయర్‌ సహా ఏడుగురు నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన చార్జిషీట్‌ను.. రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. సుమారు 10 వేల పేజీలతో తొలి అభియోగపత్రాన్ని.. గతనెల 25న సీబీఐ దాఖలు చేసింది. ఇందులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్‌లను నిందితులుగా పేర్కొంది.

దీనిపై విచారణ అనంతరం.. సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఏడుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 3న చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న ఏడుగురు నిందితుల్లో.. ఇప్పటికే ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరును ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నా.. చార్జ్‌షీట్‌లో మాత్రం చేర్చలేదు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, మనీష్ సిసోడియా సహా మిగిలిన వారి పాత్రపై విచారణ జరుగుతున్నట్లు వాదనల్లో కోర్టుకు తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.