ETV Bharat / crime

robbery attempt in muthoot finance :ముత్తూట్ ​ఫైనాన్స్​లో పట్టపగలే దోపిడికి వచ్చారు..

సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడికి యత్నించిన (robbery attempt in muthoot finance) ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కార్యాలయంలోకి వచ్చిన ఈ ముఠా అనుమానస్పదంగా తిరుగుతుండటంతో... సిబ్బంది అలారం నొక్కారు. దీంతో అప్రమత్తమైన ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులు, స్థానికులు వారిని వెంబడించారు.

robbery attempt
robbery attempt
author img

By

Published : Nov 29, 2021, 3:51 PM IST

ముత్తూట్ ​ఫైనాన్స్​లో దోపిడికి యత్నం... ముగ్గురు అరెస్ట్​

robbery attempt in muthoot finance: సికింద్రాబాద్​ తిరుమలగిరిలోని ముత్తూట్​ ఫైనాన్స్​లో దోపిడికి యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం 11గంటల సమయంలో ముగ్గురు వ్యక్తుల ముఠా ముత్తూట్ ఫైనాన్స్​కు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిని గమనించిన ముత్తూట్​ ఫైనాన్స్​ సిబ్బంది అలారం నొక్కారు. అలారం మోగడంతో సిబ్బంది, స్థానికులు అప్రమత్తమయ్యారు.

దోపిడికి యత్నించిన ముగ్గురు పరుగందుకున్నారు. తిరుమలగిరి ఎల్​ఐసీ కార్యాలయం వరకు దుండగులు పరుగెత్తారు. గమనించిన ట్రాఫిక్​ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి వద్ద మారణాయుధాలు లభించడంతో అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

నిందితులంతా మహారాష్ట్రవాసులు

పట్టుబడిన వారు మహారాష్ట్ర అయోధ్యనగర్​కు చెందిన లక్ష్మణ్​, బాలకృష్ణ, అశోక్​గా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మీసేవ ఉద్యోగి శంకర్ హత్యకేసులో.. భార్యే నిందితురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.