హైదరాబాద్ బాలాపూర్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్యాషియర్ వద్ద ఐదుగురు వ్యక్తులు దోపిడీ చేశారు. వీరిని అరెస్టు చేసిన బాలాపూర్ పోలీసులు నిందితుల నుంచి రూ.1,28,890 నగదు, రెండు గోల్డ్ చైన్స్, 3 ద్విచక్రవాహనాలు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు జక్కుల బాలకృష్ణ గతంలో ఇదే గ్యాస్ గోదాంలో పనిచేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు. అతని ప్లాన్‌తోనే మిగతా నలుగురు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి : మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో రైళ్లు!