ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాసనగర్‌లో ఉన్న కరూర్ వైశ్య బ్యాంక్‌లో రూ.90 వేల నగదును గడివేములకు చెందిన నరసింహుడు, సోమన్న అనే వ్యక్తులు డ్రా చేశారు. ఆ నగదును ద్విచక్ర వాహనానికి ఉన్న బ్యాగులో ఉంచారు. అనంతరం కాళికాంబ ఆలయం వద్దకు చేరుకున్నారు.
ద్విచక్రవాహనం ఆపి నూనె కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మరో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు బైక్ బ్యాగులో ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగదు దోసుకెళ్లిన సంఘటనా దృశ్యాలు.. సీసీ కెమెరాకు చిక్కాయి.
ఇదీ చదవండి: 'వివేకా హత్య కేసులో సిట్‌పై ఏబీవీవి నిరాధార ఆరోపణలు'