ETV Bharat / crime

దారి తప్పారు.. ప్రమాదానికి చిక్కారు - కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు

డ్రైవర్‌ అతి వేగం.. మలుపు.. ఆపై నిద్రమత్తు.. నిర్లక్ష్యం వెరసి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఏపీలోని కర్నూలు జిల్లా మదనపల్లె నుంచి అజ్‌మేర్‌ యాత్రకు బయలుదేరిన నౌజీరా బీ కుటుంబం తొలుత కడప వెళ్లి అక్కడ పెద్ద దర్గాను దర్శించుకున్నారు. తర్వాత ఆళ్లగడ్డ మీదుగా నంద్యాల రోడ్డు నుంచి వారు కర్నూలుకు చేరాలి. కానీ డ్రైవర్‌ దారితప్పి కడప నుంచి తాడిపత్రికి చేరారు. అక్కడ కనుక్కుని గుత్తి మీదుగా కర్నూలు వచ్చేటప్పుడు వెల్దుర్తి వద్ద వాహనం ప్రమాదానికి గురైంది.

road accident kurnool district
దారి తప్పారు.. ప్రమాదానికి చిక్కారు
author img

By

Published : Feb 15, 2021, 10:51 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మదనపల్లె నుంచి అజ్‌మేర్‌ యాత్రకు బయలుదేరిన నౌజీరా బీ కుటుంబం తొలుత కడప వెళ్లి అక్కడ పెద్ద దర్గాను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆళ్లగడ్డ మీదుగా నంద్యాల రోడ్డు నుంచి కర్నూలుకు చేరాలి. డ్రైవర్‌ దారితప్పి కడప నుంచి తాడిపత్రికి చేరారు. అక్కడ కనుక్కుని గుత్తి మీదుగా కర్నూలు వచ్చేటప్పుడు వెల్దుర్తి వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మృతుల ఫోన్లన్నీ తుక్కయ్యాయి. ఒక సాధారణ ఫోన్‌ దొరకడంతో అందులోని నంబర్లు చూసి బంధువులకు సమాచారం అందించారు.

ఆ పిల్లలు అనాథలయ్యారు..

నౌజీరా బీ భర్త ఇమామ్‌ సాహెబ్‌ గతంలోనే మరణించారు. ఆమె తన ముగ్గురు కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, మనవళ్లతో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ప్రమాదంలో పెద్దలంతా మరణించడంతో మిగిలిన పిల్లలు అనాథలయ్యారు. తల్లిదండ్రుల కోసం వారు రోదిస్తుండగా ఆసుపత్రి సిబ్బంది నచ్చజెబుతున్నారు. వీరి బాధ్యతలను ప్రస్తుతం స్త్రీ, శిశు సంక్షేమశాఖకు అప్పగించారు.

తల్లి, చెల్లి మృతదేహాలను చూసి తల్లడిల్లి..

రఫీ అత్త షేక్‌ అమీర్‌జాన్‌ (63) భర్త సిరాజుద్దీన్‌ గతంలో చనిపోయారు. వీరికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మదనపల్లెలో ఉంటున్న కుమార్తె షేక్‌ మస్తానీ వద్ద అమీర్‌జాన్‌ ఉంటారు. కుమార్తె, అల్లుడు రఫీ వెంట ఆమె సైతం అజ్‌మేర్‌ దర్గాకు బయల్దేరి ప్రమాదంలో మరణించారు. మృతురాలి మరో కుమార్తె షఫ్రీన్‌బీ కర్నూలు వచ్చి తల్లి, చెల్లెలి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.

ఆధారం కోల్పోయిన డ్రైవర్‌ కుటుంబం..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ నజీర్‌కు భార్య ఫరీదా, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మోసిన్‌ గతేడాది డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగవేటలో ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నజీర్‌ మృతితో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

కుటుంబ పెద్దను కోల్పోయి..

ఈ ప్రమాదంలో మృతిచెందిన షేక్‌ షఫీకి ముగ్గురు తమ్ముళ్లతో పాటు భార్య జమీలాబీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన వాహన మెకానిక్‌గా పనిచేసేవారు. దస్తగిరి కుటుంబానికి సన్నిహితుడు కావటంతో వారితో అజ్‌మేర్‌ బయలుదేరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శవపరీక్షల అనంతరం ఆదివారం రాత్రి 7 గంటలకు కర్నూలు నుంచి మృతదేహాలను మదనపల్లె తరలించారు.

ఇదీ చదవండి: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.