ఏపీ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మార్కాపురం ఆస్పత్రికి తరలించారు.
శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా... మేజర్ కాలువ దిమ్మెను బలంగా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రులు గుంటూరు వాసులుగా గుర్తించారు.
ఇదీ చదవండి: హైటెన్షన్ కేబుల్ పోల్‌ను ఢీకొట్టిన టిప్పర్